
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా సంచలనమే..ఓ పక్క లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు , థియేటర్స్ బంద్ అయినప్పటికీ .వర్మ మాత్రం తన మార్క్ సినిమాలు ATT లో రిలీజ్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్ , నగ్నం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాదు సరికొత్త భామలను ప్రేక్షకులకు పరిచయం చేసాడు.
ఇప్పుడు తాజాగా అప్సర రాణి అంటూ మరో భామ ను తన ట్విట్టర్ ద్వారా పరిచయం చేసాడు. వాస్తవానికి ఈ అమ్మడు తెలుగు వారికీ సుపరిచితురాలు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అంకిత మహారాణా. 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ఎప్పుడూ కొత్త కొత్త అందాలను పరిచయం చేసే వర్మ ఈ సారి ఈ అమ్మడిని ఎంచుకున్నాడు . తన మార్క్ మిస్ అవ్వకూడదనుకున్నాడేమో అమ్మడి పేరు మార్చేశాడు. ఈ వయ్యారి అందానికి ఫిదా అయ్యాడనుకుంటా.. ఏకంగా ‘అప్సరా రాణి’ పేరు మార్చాడు. వర్మ అనౌన్స్ చేయగానే కుర్రాళ్లంతా ఈమెను గూగుల్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసారు. ఆమె ఫోటోలు అంతకుముందు చేసిన సినిమాలు అన్నీ బయటకు వచ్చాయి. అది చూసిన నెటిజన్లు ‘అమ్మ వర్మా .. అంకితను అప్సరాని చేసావా…’అంటూ కామెంట్స్ పెడుతున్నారు.









