తల్లికాబోతున్న అనుష్క ..సాక్ష్యం ఇదేనా ..?

బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ..ఆ తర్వాత కోహ్లీ తో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓ పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ అందరిని అలరిస్తుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కేక పుట్టించే బికిని పోజ్ లతో సెగలు పుట్టిస్తుంటుంది.

తాజాగా ఈ అమ్మడు తల్లి పోస్ట్ కొట్టేయబోతున్నట్లు కొన్ని పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్యలో రెండు మూడు సార్లు అనుష్క ప్రెగ్నెంట్ వార్తలు వచ్చినప్పటికీ, దానిపై పూర్తి క్లారిటీ రాలేదు . కాగా రీసెంట్‌గా ఓ అభిమాని తన ఆతృతను తట్టుకోలేక అనుష్క బేబి బంప్‌తో ఉన్నట్టు ఫోటో షాప్ చేశాడు. జెనీలియా ప్రెగ్నెంట్‌తో ఉన్న సమయంలో రితేష్‌తో కలిసి ఉన్న ఫోటోను తీసుకొని వారి ఫేస్ ల ప్లేస్‌లో అనుష్క, విరాట్ కోహ్లీ ఫేస్ లను పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.