అవతార్ 2 షూటింగ్ స్టార్ట్

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తుండడం తో ప్రజలు బయటకు వస్తున్నారు. అలాగే చిత్ర సీమా సైతం షూటింగ్లు మొదలు పెడుతున్నారు.

తాజాగా జేమ్స్ కామెరాన్ కూడా ‘అవతార్’ సీక్వెల్‌ షూటింగ్‌ను జీరో కరోనా కేసులున్న న్యూజిలాండ్‌లో మొదలుపెడ్డాడు. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ అతని చిత్ర బృందం న్యూజిలాండ్‌కు చేరుకున్నారు. అక్కడ 14 రోజులు క్వారంటైన్ పూర్తైయిన తర్వాత అక్కడ స్టోన్ స్ట్రీట్ ష్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు చిత్ర యూనిట్.