గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టిన బాలయ్య

నందమూరి బాలయ్య మజాకా..బాలకృష్ణ ఏం చేసిన..చేయకపోయినా సంచలనమే..తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి అభిమానులను సంబరాలకు గురి చేసారు. ఈనెల 10న బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇదే ఏడాది షష్టి పూర్తి చేసుకున్న బాలయ్య జన్మదినానన్ని ఘనంగా జరపాలని ఫ్యాన్స్ భావించారు.

ఐతే కరోనా నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించరాదని, తనని కలవడానికి ఎవరూ రావద్దని బాలయ్య అభిమానులకు పిలుపునివ్వడం తో , అభిమానులంతా కూడా జూన్ 10న ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లుకు ఏక కాలంలో 21 వేల కేక్లను కట్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ వైడ్ గా ఉన్న బాలయ్య ఫ్యాన్స్ వివిధ దేశాలలో ఈ వేడుక నిర్వహించగా, దాదాపు 80 వేల మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ వేడుకను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యవేక్షించి వరల్డ్ రికార్డుగా అనౌన్స్ చేశారు.