
డైరెక్టర్ బి గోపాల్ అంటే తెలియని సినీ అభిమాను ఉండడు. కలెక్టర్ గారి అబ్బాయి, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టేట్ రౌడీ , మెకానిక్ అల్లుడు, సమరసింహా రెడ్డి, ఇంద్ర వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందజేసి మాములు హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన గొప్ప డైరెక్టర్.
అలాంటి డైరెక్టర్ తో నటసింహ బాలకృష్ణ తో వర్క్ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో సమరసింహా రెడ్డి చిత్రం వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందని ఆ మధ్య గట్టిగానే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఈ సినిమా రద్దయిందనే వార్తలు వైరల్ కావడం తో అంత నిరాశలో పడ్డారు. కానీ ఆ వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది.
‘బాలయ్య – బి గోపాల్’ కాంబినేషన్ సినిమా ఖచ్చితంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర ఓ ఎమోషనల్ లైన్ రాసి ఉంచాడట. అది గోపాల్ కు చెప్పగా ఓకే అన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా రానున్నట్టు వినికిడి.









