
హీరోగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న అల్లరి నరేష్ కు మహర్షి చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. నరేష్ యాక్టింగ్ కు అందరూ మరోసారి ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు బంగారు బుల్లోడు సినిమాలో నటిస్తున్నాడు.
‘నందిని నర్సింగ్ హోమ్’ లాంటి కామెడీ డ్రామాకు దర్శకత్వం వహించిన పీవీ గిరి ఈ సినిమాకు దర్శకత్వం వస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా పూజా ఝవేరి నటిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భాంగా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. అది ఎలా ఉందొ మీరే ఓ లుక్ వెయ్యండి.









