
బిత్తిరిసత్తి ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. తనదైన శైలి యాసతో విలక్షణమైన హావభావాలను పలికిస్తూ.. యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిత్తిరిసత్తి ..ఇప్పుడు బిగ్ బాస్ 4 లో కనిపించబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ 4లో బిత్తిరి సత్తి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. తద్వారా బిగ్ బాస్ 4కి మంచి రేటింగ్ రావడంతో పాటు ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.









