
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తారనేది మొదటి నుండి చర్చ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారం కాగా..తాజాగా అమల పాల్ నటిస్తుందనే వార్తలు వైరల్ కావడం తో దీనిపై బోయపాటి క్లారిటీ ఇచ్చాడు.బాలయ్య సినిమా కోసం పేరున్న, క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకోవడం లేదని మరోసారి స్పష్టంచేశాడు. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఇద్దరు కొత్తమ్మాయిల్ని ఫైనలైజ్ చేశామని, వాళ్లలోంచి ఒకర్ని ఫిక్స్ చేస్తామని తెలిపాడు. బోయపాటి ప్రకటనతో బాలయ్య సినిమా హీరోయిన్లపై ఇన్నాళ్లూ వచ్చిన పుకార్లకు చెక్ పడింది. ఆ కొత్తమ్మాయి ఎవరనే ఆసక్తి అందర్లో నెలకొంది.









