
లాక్ డౌన్ కారణంగా సినీ స్టార్స్ ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్ లేకపోవడం తో వారి సమయాన్ని అంత కూడా కొత్త కథలను వినడానికి , కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయిస్తున్నారు. ఇక జిమ్ లు సైతం బంద్ కావడం తో వారు మార్నింగ్ వాక్ ను సిటీ ఔట్స్ కట్స్ లో చేస్తున్నారు. తాజాగా బన్నీ మార్నింగ్ వాక్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టాడు. `లవ్ మార్నింగ్ వాక్స్` అంటూ తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్న ఫొటోను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మార్నింగ్ వాక్ కోసం బన్నీ తెల్లవారు జామునే హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా..దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణం.









