చక్ర ట్రైలర్ చూసారా..?

హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి తెలుగు లో చక్ర అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ను సోమవారం చిత్ర యూనిట్ రిలీజ్ ఆకట్టుకోగా ..శనివారం చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘చ‌క్ర‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది.తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్‌ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య..‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్, క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ జూన్ 27 సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.సైబర్ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘కంటికి కనిపించని వైరస్‌ మాత్రమే కాదు.. వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ కూడా ప్రమాదకరమే.. వెల్‌కమ్‌ టు డిజిటల్‌ ఇండియా’ అంటూ ఆగంతకుడు చెప్పిన డైలాగ్‌లో ట్రైలర్‌ ముగిసింది.హీరోయిన్‌గా పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది.