
మెగా అభిమానులకు గుడ్ న్యూస్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో నటిస్తుండగానే..కొరటాల శివ- చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ లో గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తండ్రి చిత్రంలో గెస్ట్ పాత్రను పోషిస్తున్న చరణ్, బాబాయ్ పవన్ చిత్రంలోనూ అతిథిగా మెరవబోతున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే.. క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా ఓ పీరియాడిక్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో చరణ్ నటించే అవకాశాలున్నాయని టాక్. ఇదే కనుక నిజమైతే మెగాభిమానులకు ఇంతకన్నా పండగ మరోటి ఉండదు.
