పవన్ మూవీ లో మెగా పవర్ స్టార్..?

మెగా అభిమానులకు గుడ్ న్యూస్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో నటిస్తుండగానే..కొరటాల శివ- చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ లో గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తండ్రి చిత్రంలో గెస్ట్ పాత్ర‌ను పోషిస్తున్న చ‌ర‌ణ్, బాబాయ్ ప‌వ‌న్ చిత్రంలోనూ అతిథిగా మెర‌వ‌బోతున్నార‌ని సమాచారం. వివ‌రాల్లోకెళ్తే.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఓ పీరియాడిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఇదే క‌నుక నిజ‌మైతే మెగాభిమానులకు ఇంతకన్నా పండగ మరోటి ఉండదు.