ఎండోమెంట్స్ అధికారిగా చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సినిమా తాలూకా అనేక విషయాలు బయటకొస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ మూవీ లో రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారట. కాకపోతే పది నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే అలా కనిపిస్తారట. పైగా ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని కూడా టాక్. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఫిల్మ్ సిటీలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది.