కరోనా బారిన పడిన మరో బుల్లితెర నటుడు

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు , బుల్లితెర నటులు కరోనా బారిన పడగా..తాజాగా మరో టీవీ నటుడు దీని బారిన పడ్డాడు.

తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన రవి కృష్ణకు కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రవి కృష్ణ వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వచ్చిందని నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రవి కృష్ణ‌ను క్వారెంటైన్‌కు పంపించివేశారు. ప్రస్తుతం రవి కృష్ణ కరోనా చికిత్స తీసుకుంటున్నాడు. ఇక రవి కృష్ణతో గత కొన్ని రోజులుగా దగ్గరగా తిరుగుతున్న వారందరూ తీవ్ర అందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.