”దేవదాసు” కు 67 ఏళ్లు..

1950 దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్ఛదశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు (దేవదాసు), సావిత్రి (పార్వతి), యస్.వీ.రంగారావు (జమీందారు నారాయణ రావు), చిలకలపూడి సీతారామాంజనేయులు , లలిత (చంద్రముఖి) , దొరైస్వామి (నీలకంఠం), ఆరణి సత్యనారాయణ (ధర్మన్న), శివరాం పేకేటి (భగవాన్), ఆర్.నాగేశ్వరరావు , సీతారామ్ (బండివాడు) గా నటించారు.

శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు “దేవదాసు” అనే పదంతెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బరామన్కు అంకితమిచ్చారు.

1953 జూన్ 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నేటికీ 67 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో ఈ చిత్రం తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.