తమిళ్ వైపు చూస్తున్న డింపుల్ హయాతి..

2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది డింపుల్ హయాతి. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయేసరికి అమ్మడు నిరాశకు గురయింది. ఇక ఆ సినిమా తర్వాత యురేకా సినిమాలో ఓ క్యారెక్టర్ ప్లే చేసింది. ఆ సినిమా కూడా ఆశించిన పేరు తీసుకురాలేదు. ఇక ఈ అమ్మడు గతేడాది హరీష్ శంకర్ రూపొందించిన గద్దలకొండ గణేష్ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. సూపర్ హిట్టు నీ హైట్.. సూపర్ హిట్టు నీ రూట్.. అంటూ అమ్మడి అందాలను కూడా ఆరబోసి ఆకట్టుకుంది.

తెలుగులో కేవలం ఐటమ్ సాంగ్స్ కోసం మాత్రమే హయాతిని దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారని ఆవేదన చెందుతోంది. ఇక లాభం లేదని కోలీవుడ్ వైపు అడుగులేస్తుంది. తమిళం నుండైతే మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తోంది. తాజాగా మాట్లాడుతూ.. యూత్ కోసం అందాలు ఆరబోయక తప్పదు అంటుంది. చిన్నప్పటి నుండి మంచి నటిగా పేరు పొందాలని ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడేమో గ్లామర్ రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలా అని గ్లామర్ రోల్స్ చేయనని కాదు. మళ్లీ గ్లామర్ డాల్ అని అనిపించుకోవాలని లేదని తెలిపింది.