
బాలీవుడ్ హీరో సుశాంత్ గత ఆదివారం ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోగా, దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దీనిలో భాగంగా సుశాంత్ సన్నిహితులతో పాటు, ఆయనకు మానసిక వైద్యం అందించిన డాక్టర్ ని కూడా విచారించడం జరిగింది. విచారణలో పాల్గొన్న మానసిక వైద్యుడు కేసరి చావ్డా సుశాంత్ మానసిక స్థితి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
సుశాంత్ కొన్నాళ్లుగా మానసిక వేదనతో రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపారట. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ లో అంకిత లోఖండే అతనికి చాలా ఇష్టం అట. ఆమెతో బ్రేక్ అప్ కావడం అతను ఇష్టపడలేదట. తనతో రిలేషన్ నడిపిన అమ్మాయిలలో అంకిత బిహేవియర్ ని సుశాంత్ బాగా ఇష్టపడ్డారట. ఇక ఓ డైరెక్టర్ కూతురు మరియు కృతి సనన్ తో రిలేషన్ కూడా వర్క్ అవుట్ కాలేదట. కాగా సుశాంత్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న రియా చక్రవర్తి ప్రవర్తన కూడా సుశాంత్ ని ఇబ్బందిపెట్టిందని..డాక్టర్ తెలిపినట్లు తెలుస్తుంది.









