బండ్ల గణేష్ కు కరోనా ఫై అసలైన క్లారిటీ

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో కరోనా ఉదృతి ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యముగా హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలలో కరోనా ఎక్కువ గా ఉంది. అయితే బండ్ల గణేష్ కు సైతం కరోనా వచ్చిందని.. కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా సైలెంటుగా టెస్టులు చేయించుకుంటున్నట్లు సోషల్ మీడియాలోవార్తలు అయితే వస్తున్నాయి.

హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన గణేష్‌ను అక్కడ ముందుగా కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు. తీరా చేసిన తర్వాత ఈయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఈ విషయం ఫై మీడియా వారు గణేష్ ను సంప్రదించగా.. అలాంటిదేం లేదని.. తాను బాగానే ఉన్నానని.. కావాలంటే మీడియా ముందుకు కూడా వస్తానని చెప్తున్నాడు.