
లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్ లకు సైతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం ప్రకటించిన సడలింపుల కారణంగా మళ్లీ షూటింగ్ లకు అనుమతి దొరికింది. దీంతో సీరియల్ షూటింగ్ లు ముందుగా మొదలు పెట్టారు.
ఈరోజు నుండి ఈటీవీ లో ప్రసారమై జబర్ధస్త్ షో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నానక్ రామ్ గుడాలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జబర్దస్త్ షో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దీనితో హాస్యప్రియులను జబర్ధస్త్ టీం లీడర్స్ కొత్త ఎపిసోడ్స్ తో అలరించనున్నారు.









