సీనియర్ జయంతి ఆరోగ్యం ఫై ఆరా..

అనేక భాషల్లో దాదాపు 500 లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి జయంతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధి తో బాధపడుతుండడం తో ఆమెను కుటుంబ సభ్యులు బెంగూళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు ఆమె కుమారుడు కృష్ణ కుమార్ వెల్లడించారు. చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని అన్నారు. తన తల్లికి కరోనా పరీక్ష కూడా చేయించామని, రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే, జయంతికి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.