
యాంగ్రీ యంగ్ రాజశేఖర్ పెళ్లి రోజు ఈరోజు. ఈ సందర్భాంగా పెళ్లి ఫోటో ను షేర్ చేసి అభిమానులను సంతోష పెట్టారు. 1991 జూలై 10 చెన్నైలో రాజశేఖర్ – జీవితల వివాహం జరిగింది. నేటితో 29 ఏళ్ల పూర్తి చేసుకున్నారు.
టాలీవుడ్‌లో మోస్ట్ ఫేవరబుల్ కపుల్‌గా నిలిచి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈరోజు తమ పెళ్లిరోజును పురష్కరించుకుని హీరో రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా అలనాటి తమ పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో రాజశేఖర్, జీవిత జంట చూడముచ్చటగా ఉంది.









