35 ఏళ్లు పూర్తి చేసుకున్న కాజల్

కాజల్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో అభిమానులు , సినీ ప్రముఖులు అమందికి విషెష్ అందిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 2007లో లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన కాజల్ ..ఆ తర్వాత చందమామ , మగధీర చిత్రాలతో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరింది. వరుస హిట్ల తో అతి తక్కువ టైం లోనే టాప్ హీరోయిన్ అయ్యింది.

మొదటి నుండి కూడా కాజల్ బిజీ హీరోయినే.. ఎల్లప్పుడూ చేతి నిండా సినిమాలతో గడుపుతుంది. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్.. ఎన్నో ప్లాప్ అనుభవాలు.. అన్నీ కలిపి అమ్మడు రోజురోజుకి తనని తను గొప్ప నటిగా మలుచుకుంటుంది. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ‘ఇండియన్-2’.. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. అమ్మడు తెలుగు తమిళం అనే తేడా లేకుండా నటిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన కాజల్ పెళ్లి.. ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు.