సాంగ్స్ కంపోజిషన్స్‌ కళ్యాణ్ కృష్ణ

గత కొన్ని నెలలుగా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా చేయాలనీ నాగ్ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ షో తర్వాత నాగ్ ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడని అంత అనుకున్నారు. కానీ ఎందుకో సినిమా సెట్స్ పైకి రాలేదు.

అయితే అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం జూమ్ యాప్ లో కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తయ్యాయట. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడట.