
ప్రస్తుతం అన్ని ఇండీస్ట్రీ లలో బయోపిక్ ల హావ నడుస్తుంది. సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల యొక్క జీవిత కథను వెండితెర ఫై చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ లు రాగా..తాజాగా తమిళ స్టార్ కార్తీక్ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తన బయోగ్రఫీ ని తానే స్వయంగా కార్తీక్ రాస్తున్నాడట . 80 లో స్టార్ హీరోగా అరరించిన కార్తీక్ ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో బయోపిక్ ను ప్రకటించడం తో అంతా కూడా ఇప్పటి నుండే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ బయోపిక్ లో కార్తీక్ పాత్రలో ఏ హీరో నటిస్తారనేది చూడాలి.









