కార్తీక్ డైరెక్షన్లో సూపర్ స్టార్..?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల వరుస హిట్ల తో తన దూకుడు చూపిస్తున్నాడు. తన వయసు ను ఏమాత్రం లెక్కచేయకుండా వరుస గా సినిమాలకు సైన్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే మూవీ చేస్తున్నాడు. రజని కాంత్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

కాగా ఈ చిత్రం తరువాత రజని టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ మూవీ చేయనున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటికే రజనికి తన స్క్రిప్ట్ వినిపించగా ఆయన పూర్తి సంతృప్తి చెందాడట. అలాగే సినిమా చేద్దాం అని హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి . గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పేట మూవీ వచ్చి మంచి విజయం అందుకుంది.