
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, సీరత్ కపూర్, శ్రద్దాకపూర్, షాలిని వద్నికట్టి హీరోయిన్లుగా నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల ఛీటర్మ్ వివాదాల్లో చిక్కుకుంది. ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. రానా దగ్గుబాటి చిత్రాన్ని సమర్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తాజాగా చిత్రానికి సంబంధించి రాకేష్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు.
చిత్రంలో ప్రధాన నటులకి హిందూ దేవతల పేర్లను ఉపయోగించినందుకు రాకేశ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో ‘కృ ష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం పూర్తి శృంగారభరిత చిత్రంగా తెరకెక్కగా ఇందులో సిద్ధు ముగ్గురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగిస్తాడు. పాత్రలందరికి దేవుళ్లపేర్లు పెట్టి రొమాన్స్ నడిపించినందుకు రాకేష్ ఫిర్యాదు చేశాడు. మరి దీనిపై సైబర్ క్రైమ్ ఇలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.









