అప్పుడు మహేష్ బర్త్డే సంబరాలు స్టార్ట్ చూసారుగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే డే రెండు నెలలు ఉండగానే మహేష్ అభిమానులు సందడి షురూ చేసారు. సోషల్ మీడియా వేదికగా మిగతా ఫ్యాన్స్ రికార్డ్స్ చెరిపివేయాలని ఇప్పటి నుండే సిద్ధమయ్యారు. అడ్వాన్స్ బర్త్ డే విషెష్ తో ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్యాగ్ 4 మిలియన్స్ ట్వీట్స్ కి చేరుకుందట. మరి అడ్వాన్ బర్త్ డే విషెష్ తోనే ఇంత హంగామా చేస్తున్న ఫ్యాన్స్ మరి బర్త్ డే రోజు ఎంత రచ్చ చేస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు.

ఆగస్టు 9న మహేష్ బర్త్ డే కాగా ఈ ఏడాది 45వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రస్తుతం దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట అనే మూవీ చేయబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.