మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడో తెలుసా..?

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొన్నేళ్లు గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించారు రాజమౌళి. ఓ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తోనే అని ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు.

దుర్గ ఆర్ట్స్ బేనర్‌పై కేఎల్ నారాయణ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘దానయ్య గారితో సినిమా తర్వాత … నారాయణ గారితో చేయాలి. నారాయణ గారు, నేను మహేష్ బాబు కాంబినేషన్ అని ఎప్పట్ని నుంచో చెప్తున్నదే’ అంటూ టీవీ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్య్వూలో రాజమౌళి తెలిపారు. ఈ కబురు తెలిపిన దగ్గరి నుండి అభిమానులు తెగ సంబరాలు జరుపుకున్నారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను జేమ్స్ బాండ్ లేకపోతే.. కౌబాయ్ తరహా యాక్షన్ మూవీ అని రాజమౌళి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి కొంతమంది చారిత్రాత్మక చిత్రాన్ని లేదా సామాజిక అంశాల పై కమర్షియల్ ఫిల్మ్ ను రూపొందించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.