లేడీ డాన్ కు ప్రిన్స్ విషెష్

నేడు విజయశాంతి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను అందజేస్తున్నారు. కాగా మహేష్ సోషల్ మీడియా వేదికగా విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయశాంతిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేశ్ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

రీసెంట్ గా వీరిద్దరూ కలిసి సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించారు. వీరిద్దరి పాత్రలకు అభిమానులు ఫిదా అయ్యారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా..రష్మిక హీరోయిన్ గా నటించింది.