నితిన్ చిత్రంలో పవన్ ఆత్త..

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు వెంకీ కుడుముల భీష్మ చిత్రం ఇచ్చి ఊపిరి పోసాడు. నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టిన నితిన్..వాటిలో ముందుగా కృష్ణ చైతన్య డైరెక్షన్లో చేస్తున్న పవర్ పేట చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు.

ఈ చిత్రంలో నితిన్ మూడు విభిన్నమైన రోల్స్ లో కనిపించనున్నారని టాక్. అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నదియా కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఈమెకు ఈ చిత్రంలో కీలక రోల్ ఉంటుందని తెలుస్తుంది.