Site icon TeluguMirchi.com

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన నందు..

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను నటుడు నందు స్వీకరించారు.

బుధవారం సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని, అందులో తాను కూడ భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరికొంత మంది సినీ ప్రముఖులకు నందు విసిరారు. ‘‘మా ‘సవారి’ చిత్ర బృందం సభ్యులు అయిన హీరోయిన్ ప్రియాంక శర్మ, దర్శకుడు సాహితి మోత్కూరి, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, శ్రీకాంత్, జీవన్‌లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను. వారు మొక్కలు నాటాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలందరూ స్వతహాగా ఎవరికివారు మనిషికి ఒక మొక్క చొప్పున అయినా నాటాలి’’ అని అన్నారు.

Exit mobile version