అల్లరోడు భారీ ప్లాన్లోనే ఉన్నాడే..

హీరోగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న అల్లరి నరేష్ కు మహర్షి చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. నరేష్ యాక్టింగ్ కు అందరూ మరోసారి ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు నాంది , బంగారు బుల్లోడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ , టీజర్స్ వచ్చి ఆకట్టుకున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలు విడుదల కాక ముందే ఆయన మూడు చిత్రాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

విజయ్ కనకమేడలతో ఎస్ ఆర్ టి ఎంటరైన్మెంట్స్, ఏ కె ఎంటరైన్మెంట్స్ మరియు ఈస్ట్ కోస్ట్ పిక్చర్స్ చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చాయని సమాచారం. ఈ మూడు బ్యానర్స్ లో ఒక్కో చిత్రం నరేష్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది. మొత్తం మీద నరేష్ గట్టి ప్లానే చేసాడని అభిమానులు అనుకుంటున్నారు.