రైతు అవతారం ఎత్తిన ప్రముఖ నటుడు

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్ లు బంద్ కావడం తో నటి నటులకు ఏంచేయాలో అర్థంకావడం లేదు. నిత్యం షూటింగ్ లతో బిజీ బిజీ గా గడిపే వీరు ..ఒక్కసారిగా ఇంటికే పరిమితం కావడం తట్టుకోలేకపోతున్నారు . కొంతమంది కుటుంబ సభ్యులతో గడుపుతుండగా..మరికొంతమంది వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ రైతు అవతారం ఎత్తాడు. ఆయన తన సొంతూరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీది ఉత్తర ప్రదేశ్ లోని బుధాన అనే ఓ చిన్న టౌన్. లాక్ డౌన్ తరువాత ఆయన తన సొంతూరికి వెళ్లారు. అక్కడ వాళ్ళ సొంత వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తూ రైతుగా మారాడు.