
లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. సినీ స్టార్స్ సైతం షూటింగ్ లు బంద్ కావడం తో వారికీ ఫుల్ రెస్ట్ దొరికినట్లు అయ్యింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీ గా గడిపే వీరు..ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరికొంతమంది వంటిట్లో తమకు ఇష్టమైన వంటకాలు చేస్తూ బిజీ అవుతున్నారు.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం సోషల్ మీడియా లో అందాల ప్రదర్శన చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో పిక్ పెట్టింది. అంతే అభిమానులకు కన్నుల పండుగే అవుతుందని చెప్పాలి. ఆ మోడరన్ డ్రెస్సులో అమ్మడి అందాలు కనిపించి కనిపించినట్లు.. చూపించి చూపించనట్లుగా ఊరిస్తున్నాయి. ఈ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్లు నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.









