పెళ్లి కంటే ముందే నిహారిక ఆ పని చేయబోతుందట..

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. దీంతో తన పద్దతిని మార్చేసి గ్లామర్ యాంగిల్ లో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా లో తనలోని హాట్ నెస్ ని బయట పెట్టడం స్టార్ట్ చేసి ఆకట్టుకోగా..తాజాగా తనకు కాబోయే భర్త ను పరిచయం చేసింది.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్న చైతన్య ను ఈమె వివాహం చేసుకోబోతుంది. ఆగస్టులో వీళ్ల నిశ్చితార్థం ఉండబోతుందని అంటున్నారు. అలాగే ఇదే ఏడాది డిసెంబర్‌లో నిహారిక పెల్లి చైతన్యతో జరిగే అవకాశాలు ఉన్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె పెళ్లి కంటే ముందు నిహారిక ఓ తమిళ్ మూవీ చేయనుందని సమాచారం. ఓ మై కడవులే ఫేమ్ అశోక్‌సెల్వన్‌ హీరోగా నటిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ స్వాతి ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది. జె.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను తెలిపేలా కాస్త కామెడీని మేళవించి రూపొందిస్తున్నట్టు వినికిడి. మరి ఇదే లాస్ట్ సినిమా అవుతుందా..లేక పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.