సుశాంత్ ఆత్మహత్య ఫై నిఖిల్ సంచలన ట్వీట్స్

బాలీవు‌డ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఇండస్ట్రీ లో సంచలనం రేపుతోంది. సిని నటులు, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేయగా.. రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్‌ లేని వాళ్లని తొక్కేస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య కు పాల్పడ్డని అంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతుంటే తొక్కేసే వాళ్లు కచ్చితంగా ఉంటారని నిఖిల్‌ చెప్పుకొచ్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలని, చావు దానికి పరిష్కారం కాదని అన్నాడు. ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదని నిఖిల్‌ అభిప్రాయపడ్డాడు.