
అలా మొదలయ్యింది చిత్రం తో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టిన నిత్యా మీనన్..ఆ తర్వాత డీసెంట్ ఫిలిమ్స్ చేసి ఆకట్టుకుంది. నటనలో మంచి మార్కులు వేసుకున్నప్పటికీ , ఈ మ్మాడు ఎత్తు తక్కువ గా ఉండడం తో యంగ్ హీరోల పక్కన ఛాన్స్ లు రావడం లేదు. ఇంతకాలం ఏదో విధంగా కాలం వెళ్లదీసిన ఈ భామ..ప్రస్తుతం డైరెక్షన్ వైపు చూస్తుందట.
అది కూడా సొంతగా రాసిన కథతోనే ఆమె దర్శకురాలిగా మారనున్నారట. తాజాగా లాక్‌డౌన్ కారణంగా మూవీ షూటింగులు నిలిచిపోవడంతో ఈ విరామంలో నిత్యామీనన్ రచయిత్రిగా మారినట్లు సమాచారం. పలు స్క్రిప్ట్స్ ఆమె సిద్దం చేసినట్టు తెలుస్తోంది. మరి అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి.









