హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు బ్రేక్..ఎందుకంటే

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎలా ఉందొ మాటల్లో చెప్పలేం. రోజు రోజుకు వందల కేసులు నమోదు అవుతుండడం తో నగర వాసులు భయంతో వణికిపోతున్నారు. కాగా హైదరాబాద్ పరిధిలో ఇవాళ రేపు (గురు శుక్రవారం) వైరస్ టెస్టులు నిలిపివేస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు ప్రకటించినట్లు సమాచారం. హైదరాబాద్ పొరుగున ఉన్న జిల్లాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో నేడు రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ టెస్టులు ప్రారంభమయ్యే అవకాశముంది. వైరస్ టెస్టులు పెంచాలని కేసీఆర్ సర్కారు ను హైకోర్ట్ ఆదేశించింది. దీంతో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 16 వరకు రాష్ట్రంలో 44341 టెస్టులు చేయగా.. 5406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 24 నాటికి 67318 టెస్టులు చేయగా.. 10444 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.