
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఈ మూవీ చేస్తున్నాడు. కాగా లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ పడింది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తాలూకా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఎదురుచూపులకు మాత్రం తెరపడడం లేదు.
కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పునఃప్రారంభం అయిన వెంటనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఉంటుందని అంత అనుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా జరిగేలా లేదు. పరిమిత సిబ్బందితో ఆంక్షల మధ్య ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ ప్రాజెక్ట్ షూటింగ్ నిర్వహించడం కష్టం అని రాజమౌళి భావిస్తున్నారట. షూటింగ్ కోసం సెట్ సిద్ధంగా ఉన్నా, ఆయన మొదలుపెట్టడానికి ఎందుకో ఆలోచిస్తున్నారట. పరిమిత సభ్యులతో షూటింగ్ మొదలుపెట్టి ఇబ్బంది పడే బదులు నిదానంగా తరవాతే మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇప్పట్లో రావడం కష్టమే.









