ఇప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడట..

అల వైకుంఠపురం లో చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ మూవీ ప్లాన్ చేసాడు. ఆ సినిమా పనుల్లోనే బిజీ గా ఉన్నాడు. అయితే పవన్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి.

అజ్ఞాతవాసి నిరాశపరిచినా జల్సా, అత్తారింటికి దారేది మంచి విజయాలు అందుకున్నాయి. చివరి చిత్రం అజ్ఞాతవాసి ఫలితం ఎలా ఉన్నా త్రివిక్రమ్ మూవీలో పవన్ ని చూడాలని ఫ్యాన్స్ ఆశ. కానీ ఇప్పట్లో పవన్ తో సినిమా చేయడట త్రివిక్రమ్. త్రివిక్రమ్ సిద్ధం చేసిన స్క్రిప్ట్స్ లో ఒక్కటి కూడా పవన్ కోసం లేదట. ఎన్టీఆర్ ఆ తర్వాత మరో ఇద్దరి హీరోలను లైన్లో పెట్టి వారికోసం కథలు సిద్ధం చేస్తున్నాడట. ఈ వార్త బయటకు వచ్చినప్పటినుండి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ మాత్రం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.