ఎన్టీఆర్ గాయాలతో ..

రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేయాలనీ చిత్ర యూనిట్ చూస్తున్నారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో పులితో తలపడతాడు.

ఆ సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు…వీడియో క్లిప్ లు చాలా రోజుల క్రితం బయటికి రావడం జరిగింది. ఈ ఫైట్ లో చొక్కాలేకుండా గాయాలతో పులితో తపడుతున్న ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పులి ఫైట్ సన్నివేశంలో ఎన్టీఆర్ మెరుపు వేగం మెస్మరైజ్ చేస్తుందట. దాదాపు ఐదు నిమిషాలకు పైగా సాగే పోరులో నువ్వా నేనా అన్నట్లు ఎన్టీఆర్ పులితో తలపడతాడట. ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అంటున్నారు.