Old Heroine : ఆ రోజుల్లో ఓ ఊపు ఊపేసింది.. గుర్తుపట్టారా ఈ హీరోయిన్‌ను?

Malavika

 

Old Heroine : ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై తన గ్లామర్, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఓ నటిని ఈ ఫోటోలో చూస్తున్నారు. అవును, మీరు సరిగ్గానే గుర్తుపట్టారు! ఆమె మరెవరో కాదు, 90ల చివరలో, 2000ల ప్రారంభంలో తెలుగు, తమిళ సినీ రంగాలను ఓ ఊపు ఊపేసిన గ్లామర్ క్వీన్, నటి మాళవిక.

ఆమె అసలు పేరు శ్వేతా కొన్నూర్ మీనన్ కావచ్చు, కానీ ‘మాళవిక’ అంటేనే సినీ ప్రియులకు ఆమె వెంటనే గుర్తుకొస్తారు. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు, మాళవిక అటు తమిళంలో, ఇటు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడిపారు. ఆమె తెరపై కనిపించిందంటే చాలు, థియేటర్లలో ఈలలు, కేకలు వినిపించేవి. ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్, గ్లామరస్ రోల్స్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

తెలుగు ప్రేక్షకులకు మాళవిక “చాలా బాగుంది” (2000) సినిమాతో పరిచయమయ్యారు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇందులో ఆమె క్యూట్ లుక్స్, పర్ఫార్మెన్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను కూడా మెప్పించారు. ఆ తర్వాత “దీవించండి”, “శుభకార్యం”, “నవ్వుతూ బతకాలిరా”, “ప్రియ నేస్తమా”, “అప్పారావు డ్రైవింగ్ స్కూల్” వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించి మెరిశారు.

మాళవిక కెరీర్‌లో సింహభాగం తమిళ సినీ పరిశ్రమలోనే సాగింది. 1999లో అజిత్ కుమార్ సరసన “ఉన్నై తేడి”తో అరంగేట్రం చేసిన ఆమె, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో వెనుదిరిగి చూసుకోలేదు. రజనీకాంత్ “చంద్రముఖి”లో ఆమె నటన, అలాగే కమల్ హాసన్ “వాసూల్ రాజా MBBS” వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో కలిసి నటించడం ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చింది. “తిరుట్టు పయలే” లాంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

అయితే, మాళవిక అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె డ్యాన్స్ నంబర్స్, ఐటమ్ సాంగ్స్. తమిళ్‌లో ఆమె చేసిన చాలా స్పెషల్ సాంగ్స్ సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద హిట్‌గా నిలిచి, సినిమాకు హైప్ క్రియేట్ చేసేవి. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో, గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటలను మరో లెవెల్‌కు తీసుకెళ్లేవారు. అందుకే ‘ఓ ఊపు ఊపేసింది’ అనే మాట ఆమెకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.