
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు వరుస పెట్టి సినిమాలను ప్రకటించాడు. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్ లను ప్రకటించగా అందులో ఒకటి హరీష్ శంకర్ మూవీ. గతంలో పవన్ – హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ చిత్రం వచ్చి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇప్పటికే వకీల్ సాబ్ , క్రిష్ మూవీ లను మొదలుపెట్టిన పవన్..సమ్మర్ పూర్తయ్యాక హరీష్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. కాగా హరీష్ ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీకి క్రేజీ టైటిల్ ను హరీష్ ఫిక్స్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడే మొదలైంది అంటూ చిత్రమైన టైటిల్ దీనికి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్‌లో అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది అంటూ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్. ఆ వార్నింగే ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ గా ఫిక్స్ చేసాడట. \ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది.









