పాయల్.. పాత్ర కోసం ఆ పని చేస్తుందట..

RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , నెటిజన్లను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

సోషల్ మీడియా లో సీనియర్ స్టార్ హీరోల చిత్రాలలో నటించడానికి ఆమె ఇష్టపడటం లేదనే వార్తలు ప్రచారం.. ‘వెంకీమామ’లో ఆమె చేసిన పాత్రపై విమర్శకులు రావడం వంటివి జరిగాయి. అయితే వీటిపై ఆమె స్పదించింది. ఆమె మాట్లాడుతూ..‘‘నిజమే. నా ఫ్యాన్స్ నన్ను ఆ పాత్రలో చూడలేకపోయారు. పెద్ద వయసు ఉన్న పాత్రలో నేను నటించడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే సోషల్ మీడియాలో కూడా నాకు అలాంటి పాత్రలు చేయవద్దు అంటూ రిక్వెస్ట్‌లు పెట్టారు. అయితే దీనిపై నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. అభిమానులు అలాంటి పాత్రలు చేయవద్దు అని కోరుతున్నారు కానీ.. నేను మాత్రం ఎప్పుడూ ఎవరితో నటించను అని మాత్రం చెప్పలేదు. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఏ హీరో చిత్రంలో చేయడానికైనా నేను రెడీ..’’ అని పాయల్ చెప్పుకొచ్చింది.