
నార్త్ లో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ షో..సౌత్ లో కూడా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సైజ్ఞాలు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో నాల్గో షో మొదలుకానుంది. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే..మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, సెకండ్ సీజన్ ను నాని .. మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేసారు. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు ఎవరు హోస్ట్ గా చేస్తారు..? ఎవరు ఇంటి సభ్యులుగా ఉండబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇప్పటికే పలువురి పేర్లు బయటకు రాగా.. పూనమ్ భజ్వాతో నిర్వాహకులు చర్చలు జరిపారట. నాగార్జున హీరోగా నటించిన బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా కొంత కాలం నిలిచిన ముద్దుగుమ్మ హంసా నందినిని కూడా ఈ సీజన్ కోసం సంప్రదించారట. వీరిద్దరితో పాటు మరో హాటీ శ్రద్దా దాస్ ను కూడా రంగంలోకి దించాలని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరికి పారితోషికం భారీగా ఇచ్చే అవసరం లేదు. అలాగే వీరికి మంచి క్రేజ్ ఉండటంతో పాటు స్కిన్ షో తో షో ను గ్లామరస్ గా మార్చేస్తారు. ఇక మేల్ కంటెస్టెంట్స్ ఉంటే వారితో లవ్ ట్రాక్ కూడా మొదలు అయ్యే అవకాశాలు లేకపోలేదు. గత సీజన్ లో మాదిరిగా ఒక్క జంట లవ్ ట్రాక్ లో పడ్డా కూడా సీజన్ 4 కు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలను షోలో దించబోతున్నారట.









