‘రాధే శ్యామ్’ కోసం భారీ సెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతి రావడం తో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భారీ హాస్పటల్ సెట్ వేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో ఎక్కువగా జరిగింది. ఇంకా కూడా అక్కడే చిత్రీకరణ జరపాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి షూటింగ్స్ చేయలేని పరిస్థితి. కనుక హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులను ఇక్కడ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం 5 కోట్లతో భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట.

నాలుగు అంతస్తుల ఆ హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్.. ఐసీయూ.. జనరల్ వార్డ్ ఇంకా హాస్పిటల్ పరసరాలు వంటివి క్రియేట్ చేస్తున్నారు. అది కూడా 1980 కాలం నాటి వాతావరణంలో హాస్పిటల్ ను తీర్చి దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెట్ లో దాదాపుగా నెల రోజుల పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిత్రీకరణ జరిపేందుకు సిద్దం అవుతున్నారు.