
అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. బన్నీ 38 వ పుట్టిన రోజు సందర్భాంగా చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో స్మగ్లింగ్ సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం.









