Jailar 2: రజినీకాంత్ జైలర్ 2లో షారుఖ్.. థియేటర్లు తగలడ్డం ఖాయం..!

Jailer 2
Jailar 2 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా రెండు సంవత్సరాల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజినీ కెరీర్‌లోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. సినిమాలో ప్రత్యేక క్యామియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు రిపీట్ ఆడియెన్స్‌ను కూడా రప్పించాయి.

ఇప్పుడే ఆ విజయాన్ని కొనసాగిస్తూ ‘జైలర్ 2’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సీక్వెల్‌లో కూడా స్పెషల్ క్యామియోలను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సారి టాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ హీరో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

అయితే అతి పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే – బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌ను ‘జైలర్ 2’ కోసం ఒక స్పెషల్ క్యామియో రోల్‌లో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు షారుఖ్ నటించిన ‘రా వన్’ సినిమాలో రజినీకాంత్ తన ‘రోబో’ పాత్రలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి షారుఖ్ రజినీ సినిమాకు గెస్ట్ రోల్ చేస్తే, అది ఖచ్చితంగా సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని మార్కెట్ ప్రభావం ‘జైలర్ 2’కు పాన్-ఇండియా స్థాయిలో మరింత హైప్ తెచ్చిపెట్టగలదు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్ కలిసి తెరపై కనిపిస్తే, ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులను మించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.