
తెలుగు లో అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచినా డైరెక్టర్ సందీప్ వంగా..ఇదే చిత్రాన్ని హిందీ లో కబీర్ సింగ్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సందీప్ ఓ గ్యాంగ్ వార్ స్టోరీ ని సిద్ధం చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రణ్ బీర్ కపూర్ కోసం ఈ కథ సిద్ధం చేసాడట. రణ్‌భీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ గ్యాంగ్‌స్టర్ ప్లాన్ చేస్తుండగా, ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇద్దరు చర్చలు జరిపినట్టు సమాచారం. ముంబైలో ఈ చిత్రం రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడట.









