రష్మిక స్టెప్స్ వేస్తున్న క్యూట్ బేబీ

వ‌రుస సినిమాల‌తో ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో టాప్ హీరోయిన్‌గా అతి తక్కువ టైం లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. క‌న్న‌డంలో చ‌క్క‌టి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి టాప్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ ఛ‌లో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ , భీష్మ సినిమాల‌తో త‌న‌కంటూ మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ సరసన ఓ మూవీ లో నటిస్తుంది.

బీష్మ సినిమాలో రష్మిక నటనతోనే కాదు డాన్స్ తో కూడా మెప్పించింది. అందులో హిట్ సాంగ్ ‘వాట్ ఏ బ్యూటీ’ కి రష్మిక మాస్ స్టెప్స్ తో వేసి అలరించింది. అయితే అదే పాటకు ఓ క్యూట్ బేబీ డాన్స్ వేస్తున్న వీడియో తన ట్విటర్ లో షేర్ చేసింది. ఆ పాపా తన డాన్స్ తో ఇంప్రెస్ చేసినందుకు రష్మిక ఆ వీడియోను పోస్ట్ చేసింది.